రేపు బ్యాంకులకు బక్రీద్ సెలవు

- June 05, 2025 , by Maagulf
రేపు బ్యాంకులకు బక్రీద్ సెలవు

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2025 నెల బ్యాంక్ హాలిడేస్ (bank holiday)షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే జూన్‌లో వివిధ రాష్ట్రాలలో చాలా బ్యాంకులకు సెలవులు (bank holiday) రానున్నాయి. అలాగే RBI మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ జూన్ 2025లో మొత్తంగా 12 రోజులు క్లోజ్ చేసి ఉంటాయని గమనించాలి. అయితే కొన్ని చోట్ల మాత్రం బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూసివేయబడతాయి. అందులో జూన్ 6న ఈద్-ఉల్-అద్’హా (Bakrid), జూన్ 7న బక్రీ ఐడీ (Id-Uz-Zuha) ఇంకా జూన్ 8 ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ (bank holiday) చేసి ఉంటాయి. ఈద్-ఉల్-అద్’హా (బక్రీద్) జూన్ 6న వస్తుంది. ఆర్‌బిఐ క్యాలెండర్ ప్రకారం, కొచ్చి ఇంకా తిరువనంతపురంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే జూన్ 7న రానున్న బక్రీ ఐడి (Id-Uz-Zuha) కోసం చాలా రాష్ట్రాలలో మూసివేయబడతాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైనవి. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ మూసివేయబడతాయి.

మీ ప్రాంతంలో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా?

NEFT, RTGS, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. కానీ, చెక్ క్లియరెన్స్, నగదు విత్‌డ్రావల్/డిపాజిట్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి, ఆ రోజు అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయడం ఉత్తమం. RBI హాలిడే లిస్ట్‌ను https://www.rbi.org.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. స్థానిక బ్యాంక్ బ్రాంచ్‌ను ముందుగానే సంప్రదించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com