'మోగ్లీ 2025' 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి
- June 06, 2025
తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్సలని షూట్ చేశారు.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ని పెర్ఫార్మ్ చేశారు. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా వుండబోతున్నాయి. మారేడుమిల్లిలో మూడో షెడ్యూల్ పూర్తి చేశారు. ఇంకొక్క షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 'మోగ్లీ' ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుంది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ రోషన్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది.
ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు.
ప్రతిభావంతులైన తారాగణం, టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.
తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్, బండి సరోజ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!