ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- June 07, 2025
అజ్మాన్: ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ETCA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 6 జూన్ 2025 న మైత్రీ ఫార్మ్స్, అజ్మాన్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఉత్సాహభరితంగా జరగింది.
కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” తో కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి సభ్యులు నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా, సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష్యులు కిరణ్ కుమార్ పీచర మాట్లాడుతూ తోలి దశ ఉద్యమం నుండి మలి దశ ఉద్యమం వరకు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగ నిరధిని స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంత కర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కృషిని ,కానిస్టేబుల్ కిష్టయ్య, కాసోజు శ్రీకాంతచారి, సిరిపురం యాదయ్య, మీగడ సాయికుమార్ యాదవ్, ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. లాంటి అమరుల అమరత్వాన్ని గుర్తుచేశారు, మలి దశ ఉద్యమానికి సంగిభావంగా 2010 నుండి 2014 వరకు గల్ఫ్ గడ్డ మీద ETCA చేసిన ఉద్యమ కార్యక్రమాలను , మిలియన్ మార్చ్ , సకల జనుల సమ్మె లాంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న రోజులను గుర్తు చేసుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ సంఘాలు, ప్రవాసీ తెలంగాణ బిడ్డల పాత్ర తెలంగాణ ఉద్యమంలో అభినందనీయమని నాలుగు కోట్ల ప్రజలకు, కార్యక్రమానికి హాజరైన అందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు, ఉద్యమానికి న్యాయకత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, జేఏసీ చైర్మన్ కోదండరాం లాంటి, ఉద్యమంలో విద్యార్ధుల అలుపెరుగని పోరాటాన్ని, ఉద్యోగుల పెన్ డౌన్, కవులు, కళాకారుల ఉద్యమం వ్యాప్తి చేయడంలో చేసిన కృషిని గుర్తు చేసుకొంటూ సహకరించిన రాజకీయ పార్టీల నాయకులను అభినందించారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గల్ఫ్ సంక్షేమానికి అడుగులు పడటం అభినందనీయమని , వారి చొరవతో పెద్దలు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా కాంగ్రెస్ పార్టీ కాబినెట్ ఆమోదించడం గొప్ప విషయమని కొనియాడారు,14 సంవత్సరాలుగా గల్ఫ్ సమస్యలపై ETCA పని చేసిన అనుభవాన్ని క్రోడీకరించి త్వరలోనే రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి వీడియో ప్రెసెంటేషన్ తో పాటు సమగ్ర నివేదికను అందచేస్తామని తెలియచేసారు.
అధ్యక్ష్యులు మామిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అవతరణ దినోత్సవ వేడుకులు జరుపుకోవడం మన తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించుకోవడం అని, మన పిల్లలకు ఉద్యమ చరిత్ర, సాంస్కృతిక వైభవం గురించి తెలుస్తుంది అని, కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అభినందనీయమని, 2023 జూన్-2025 జూన్ రెండు సంవత్సరాల కాలంలో అద్భుతంగా పనిచేసిన కార్యవర్గ సభ్యులను పని తీరును అభినందించారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ETCA జూన్ 2025–జూన్ 2027 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులను ఫౌండర్ కిరణ్ కుమార్ ప్రకటించారు.రాబోయే జూన్ 29 బోనాల పండుగ కార్యక్రమంలో పూర్తి కార్యవర్గ జాబితా హోదాలతో వెల్లడిస్తామని తెలియచేసారు,గడిచిన రెండు సంవత్సరాల కాలంలో అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ రెడ్డి చేసిన పని తీరును వారి టీం సభ్యులు నిర్వర్తించిన బాధ్యతలను అభినందించారు, కొత్త కార్యవర్గం మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
కోర్ కమిటీ సభ్యులు :
1.జగదీష్ రావు చీటీ - అధ్యక్ష్యులు
2. శ్రీనివాస్ అలిగేటి - ఉపాధ్యక్షులు
3. రాణి కొట్ల - ప్రధాన కార్యదర్శి
4. శేఖర్ గౌడ్ గుండవేని - సంయుక్త కార్యదర్శి
5. తిరుమల్ రావు బీరెల్లి - కోశాధికారి
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు – 15 మంది:
1. వినోద్ కుమార్ దుర్షేటి
2. అన్నపూర్ణ అత్కని
3. సంతోష్ కుమార్ స్టంబంకడీ
4. సామ శ్రీనివాస్ రెడ్డి
5. మమతా కస్తూరి
6. సారిక పీచర
7. రఘు ఎలిగేటి
8. రాము కందుకూరి
9. కార్తిక్ రెడ్డి అన్నాడి
10.రాము జల
11. రమణ స్వర్గం
12.రాజేశ్ పోలంపెళ్ళి
13.మధు కుమార్ పౌడపల్లి
14.అజహార్ ఖాన్ ముహమ్మద్
15. మనోజ గోగుల
ఈ నూతన కమిటీ 2025 జూన్ నుండి 2027 జూన్ వరకు సేవలందించనుంది. సంఘం అభివృద్ధి, సమాజ శ్రేయస్సు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఈ కమిటీ పని చేస్తుందని వ్యవస్థాపకుడు తెలిపారు.
వేడుకలో, జానపద నృత్యాలు, పాటలతో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరిలో తెలంగాణ సమాజ ఐక్యతకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!