మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ఎఫెక్ట్..నిపుణుల హెచ్చరిక..!!
- June 10, 2025
మస్కట్: సోషల్ మీడియా వినియోగం మానసిక ఆరోగ్యంపై గణనీయమైన స్థాయిలో ప్రభావంచూపుతుందని ఒమన్‌లోని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణుడు, PTSD శిక్షకుడు డాక్టర్ బాస్మా బింట్ ఫఖ్రీ అల్ సైద్ మాట్లాడుతూ.. డిజిటల్ కంటెంట్ నమ్మకాలు, అవగాహన మాటున అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. సోషల్ మీడియా తరచుగా ప్రజలను భావోద్వేగ ఒత్తిడిలోకి నెట్టివేస్తుందన్నారు. అవాస్తవిక ప్రమాణాలకు తరచుగా గురికావడం వల్ల తక్కువ ఆత్మగౌరవం, నిర్లిప్తత, సోషల్ మీడియా వ్యసనం కూడా పెరుగుతుందని డాక్టర్ బాస్మా నొక్కి చెప్పారు.
సామాజిక ప్రభావశీలులపై ఆధారపడకుండా మానసిక ఆరోగ్య సమస్యల కోసం నిపుణులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. మానసిక కౌన్సెలింగ్, స్క్రీన్, సమయ పరిమితులు , వాస్తవ ప్రపంచ సామాజిక ఎంటేజ్ మెంట్ వంటి ఆరోగ్యకరమైన ఆన్‌లైన్ అలవాట్ల గురించి మరింత అవగాహన కోసం పిలుపునిచ్చారు. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని మనస్తత్వవేత్త సమ్రా బింట్ సయీద్ అల్ మాషారీ మాట్లాడుతూ.. వర్చువల్ కమ్యూనిటీలను పెంపొందించడంలో, మానసిక ఆరోగ్య అవగాహన ప్రచారాలను ప్రోత్సహించడంలో సోషల్ మీడియా సానుకూల ప్రభావాన్ని గుర్తించాలన్నారు. అయితే, నిరంతర పోలిక, ద్వేషపూరిత ప్రసంగాలను చూడటం, సైబర్ బెదిరింపులు విలువను దెబ్బతీస్తాయని నిద్రకు అంతరాయం కలిగిస్తాయని, ఉత్పాదకతను క్షీణింపజేస్తాయని హెచ్చరించారు.
ముఖ్యంగా పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురవుతారని తెలిపారు. డిజిటల్ ఓవర్ డిపెండెన్సీని అరికట్టడానికి ప్రభావవంతమైన చర్యలుగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), గ్రూప్ సెషన్‌లతో సహా టైమ్ మేనేజ్ మెంట్, కుటుంబం పాత్ర పెరగాలని సిఫార్సు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







