నేటి నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్
- June 11, 2025
లండన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్‌కి మరొక్క రోజే మిగిలి ఉంది. నేటి నుంచి 15 వరకు లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా – ఆస్ట్రేలియా జట్లు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ తీసుకెళ్లాలని చూస్తోంది.లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో మెగా ఫైనల్ లో వాతావరణం అనుకూలించని పక్షంలో జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించారు.
సౌతాఫ్రికా టీమ్
లార్డ్స్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు 2023లో ఓవల్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సౌతాఫ్రికా టీమ్‌కి ఒక మంచి అవకాశం. టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న సఫారీలు ఈ సారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని చూస్తున్నారు. వరుసగా ఏడు టెస్టులను గెలిచిన సౌతాఫ్రికా(South Africa) డబ్ల్యూటీసీ ఫైనల్‌ను సొంతం చేసుకుని చరిత్ర తిరగరాయాలని చూస్తోంది. గతేడాది జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చివర్లో తడబడిన దక్షిణాఫ్రికా జట్టు ఛాంపియన్స్‌గా నిలిచే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.
టైటిల్ సాధించాలని
మరోవైపు టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final). ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్‌లో వరుసగా రెండో టైటిల్ సాధించాలని ఆస్ట్రేలియా, చారిత్రక విజయం కోసం దక్షిణాఫ్రికా తలపడనుండటంతో ఈ ఫైనల్ అభిమానులకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఆస్ట్రేలియా
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, శామ్ కోన్స్టాస్, అలెక్స్ క్యారీ, ఇంగ్లిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, హేజెల్‌వుడ్, మాట్ కున్నెమాన్, నాథన్ లయన్.
దక్షిణాఫ్రికా
టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోరి, ఎయిడెన్ మర్కరమ్, ముత్తుసామీ, మార్కో యాన్సన్, ముల్దర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్హోమ్, ట్రిస్టన్ స్టబ్స్, కేవశ్ మహారాజ్, కగిసో రబడా, డేన్ పాటర్సన్, కగిసో రబడా, లుంగీ ఎంగిడి.
పూర్తి స్క్వాడ్స్
ఇక, ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, భారత్‌లో ఎక్కడ చూడాలి, విజేతకు ప్రైజ్‌మనీ ఎంత, ఇరుజట్ల పూర్తి స్క్వాడ్స్ తదితర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు) ప్రారంభమవుతుంది.డబ్యూటీసీ ఫైనల్‌ను ఎక్కడ చూడొచ్చంటే,భారత్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే అభిమానులు డిస్నీ హాట్‌స్టార్ ద్వారా మ్యాచ్‌ను ఆన్లైన్లో కూడా వీక్షించవచ్చు.ఆస్ట్రేలియా: అమెజాన్ ప్రైమ్ వీడియో,దక్షిణాఫ్రికా: సూపర్‌స్పోర్ట్ టీవీ.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!