నాకు ఆ అవగాహన లేదు, పార్టీలో జరిగింది ఇదే: సింగర్ మంగ్లీ రియాక్షన్
- June 11, 2025
హైదరాబాద్: తనపై నమోదైన కేసుపై సింగర్ మంగ్లీ స్పందించింది. తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేసుకున్నట్లు తెలిపింది. వేడుకల్లో భాగంగా మద్యం బాటిళ్లు, డీజే సౌండ్స్ పెట్టామంది. వీటికి కూడా అనుమతి తీసుకోవాలని తనకు అవగాహన లేదంది. తెలియక తప్పు జరిగిందని వాపోయింది.
బర్త్ డే పార్టీలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదని మంగ్లీ స్పష్టం చేసింది. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకుని పార్టీకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని మంగ్లీ తెలిపింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. తనపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది మంగ్లీ.
Telugu » Telangana » Folk Singer Mangli Reaction On Police Case On Her Birthday Party Nk
Singer Mangli: ఆపండి ప్లీజ్.. నాకు ఆ అవగాహన లేదు, పార్టీలో జరిగింది ఇదే- సింగర్ మంగ్లీ రియాక్షన్
పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. తనపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది మంగ్లీ.
Published By: 10TV Digital Team ,Published On : June 11, 2025 / 10:54 PM IST
Facebook
twitter
linkedin
whatsapp
telegram
google-news
daily-hunt
Singer Mangli: ఆపండి ప్లీజ్.. నాకు ఆ అవగాహన లేదు, పార్టీలో జరిగింది ఇదే- సింగర్ మంగ్లీ రియాక్షన్
Updated On : June 11, 2025 / 11:19 PM IST
Singer Mangli: తనపై నమోదైన కేసుపై సింగర్ మంగ్లీ స్పందించింది. తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేసుకున్నట్లు తెలిపింది. వేడుకల్లో భాగంగా మద్యం బాటిళ్లు, డీజే సౌండ్స్ పెట్టామంది. వీటికి కూడా అనుమతి తీసుకోవాలని తనకు అవగాహన లేదంది. తెలియక తప్పు జరిగిందని వాపోయింది.
బర్త్ డే పార్టీలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదని మంగ్లీ స్పష్టం చేసింది. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకుని పార్టీకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని మంగ్లీ తెలిపింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. తనపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది మంగ్లీ.
Also Read: హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..
”నేను మా అమ్మ నాన్నలతో కలిసి చిన్న బర్త్ డే పార్టీ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అక్కడ లోకల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరో ఒక వ్యక్తి బయట మత్తు పదార్ధాలు వాడి నా పార్టీకి వచ్చాడు. నేను పోలీసులకు పూర్తిగా సహకరిస్తా” అని మంగ్లీ తెలిపింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో తన బర్త్ డే పార్టీ ఇచ్చారు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్లు మొత్తం 48 హాజరయ్యారు. బర్త్ డే పార్టీ సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు అర్థరాత్రి త్రిపుర రిసార్ట్ పై దాడి చేశారు. పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం భారీగా పట్టుబడింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ గంజాయి టెస్టులు నిర్వహించారు. వారిలో ఒకరికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బర్త్ డే పార్టీ, విదేశీ మద్యం, డీజే.. దేనీకి అనుమతి తీసుకోకపోవడంతో సింగర్ మంగ్లీపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!