అహ్మదాబాద్‌ విమాన ప్ర‌మాదంలో 242 మంది ప్ర‌యాణీకులు, 14 మంది మెడికోస్ దుర్మ‌ర‌ణం

- June 12, 2025 , by Maagulf
అహ్మదాబాద్‌ విమాన ప్ర‌మాదంలో 242 మంది ప్ర‌యాణీకులు, 14 మంది మెడికోస్ దుర్మ‌ర‌ణం

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 230 ప్ర‌యాణీకులు, 12 మంది సిబ్బంది, 14 మంది మెడికోస్ దుర్మ‌ర‌ణం చెందారు.. విమాన ప్ర‌మాదంలో అందులో ఉన్న ప్ర‌యాణీకులెవ్వ‌రూ బ‌తికే అవ‌కాశం లేద‌ని అహ్మాదాబాద్ న‌గ‌ర్ పోలీస్ క‌మిష‌నర్ ప్ర‌క‌టించారు. అలాగే ఈ విమానంలో లండ‌న్ వెళుతున్న గుజ‌రాత్ మాజీ సిఎం విజ‌య రూపాని కూడా క‌న్నుమూశారు. కాగా విమానం స్థానిక బిజె వైద్య క‌ళ‌శాల హాస్ట‌ల్ పై కుప్ప కూల‌డంతో అక్క‌డ లంచ్ చేస్తున్న ప‌లువురు గాయ‌ప‌డ్డారు.. వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మెడిక‌ల్ విద్యార్ధులు మ‌ర‌ణించిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు..

విమాన ప్ర‌మాదంలోని ముఖ్య‌మైన అంశాలు..

  • అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం
  • మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం
  • బీజే మెడికల్‌ కాలేజీపై కూలిన AI 171 విమానం
  • 14 మందికి పైగా మెడికోలు మృతి
  • మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్‌ అయిన విమానం
  • టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్
  • విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు
  • విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది
  • విమానంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు
  • విమానంలో ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు
  • విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు
  • అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న AI 171 విమానం
  • ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
  • 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయకచర్యలు
  • విమానంలో మాజీ సీఎం విజయ్‌రూపానీ -క‌న్నుమూత
  • అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మూసివేత
  • ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నెంబర్ 1800 5691 444
  • అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com