ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితులకు రూ.కోటి నష్ట పరిహారం
- June 12, 2025
ముంబై: విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.కోటి పరిహారం ప్రకటించింది.
విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ క్షణంలో బాధ వర్ణనాతీతమని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. వారికి అవసరమైన సహకారం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!