అహ్మదాబాద్ విమాన ప్రమాదం..విచారణ ప్రారంభం
- June 12, 2025
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. పలు దర్యాఫ్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ డీజీ నేతృత్వంలో విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో బ్యూరో ఉంది.
అటు అమెరికా నుంచి బోయింగ్ సంస్థ ప్రతినిధులు భారత్ కు రానున్నారు. విమాన ప్రమాదంపై విచారణ జరపనున్నారు. విమాన ప్రమాద కారణాలను బోయింగ్ సంస్థ ప్రతినిధులు తేల్చనున్నారు. సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం 2011 నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంది. వారం రోజుల్లో ఈ విమానం పలు దేశాలను చుట్టి వచ్చింది. ఈ నెల 5న ఢిల్లీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ కు ప్రయాణం చేసింది. 6న ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ఢిల్లీ చేరుకుంది. ఈ నెల 7న ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లింది. అదే రోజున పారిస్ నుంచి ఢిల్లీ వచ్చింది. 8న ఢిల్లీ నుంచి మెల్ బోర్న్ వెళ్లి అదే రోజు ఢిల్లీ తిరిగి వచ్చింది ఎయిరిండియా విమానం. 9న ఢిల్లీ నుంచి టోక్యో వెళ్లింది. 10న ఢిల్లీకి తిరిగి వచ్చింది. 11న మరోసారి ఢిల్లీ నుంచి పారిస్ కు వెళ్లింది. అదే రోజు పారిస్ నుంచి ఢిల్లీకి చేరింది. ఈరోజు(జూన్ 12) ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది ఎయిరిండియా విమానం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీనగర్ లో జనావాసాల్లో విమానం కూలింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 52మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. మృతుల్లో ఒకరు కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసులు ఉన్నారు. మరణించిన వారిలో ఇద్దరు శిశువులు సహా 13మంది చిన్నారులు ఉన్నారు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో అద్భుతం జరిగింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. 11ఏ నెంబర్ సీటులో అతడు ప్రయాణించాడు. విమానం నుంచి దూకి అతడు తన ప్రాణాలు రక్షించుకున్నాడు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!