దుబాయ్‌లో భారతీయ దంపతుల దీనగాధ

- July 13, 2016 , by Maagulf
దుబాయ్‌లో భారతీయ దంపతుల దీనగాధ
ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసిన ఓ వ్యక్తి, తన భార్యతో కలిసి దుబాయ్‌లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. హైద్రాబాద్‌ నుంచి 2000 సంవత్సరంలో వీరు యూఏఈ చేరుకున్నారు. 14 ఏళ్ల వీరి కుమారుడు, ఇద్దరు మహిళల్ని రక్షించి, ప్రాణాలు కోల్పోగా, ఆ షాక్‌ నుంచి తేరుకోడానికి యూఏఈ వెళ్ళి, అక్కడే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పనిచేసినట్లు బాధితుడు చెప్పారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, తర్వాత పరిస్థితులు మారాయనీ, ఉద్యోగం కోల్పోయాక ఆ ఉద్యోగం కోసం తీసుకున్న కారు లోన్‌ చెల్లించలేకపోతున్నాననీ, ఈ పరిస్థితుల్లో తనను ఆదుకోవాలని హరిప్రసాద్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. వెహికిల్‌ లోన్‌ కోసం, అలాగే గడువు తీరిన వీసా రుసుం కోసం 15,000 దిర్హామ్‌లు హరిప్రసాద్‌ కుటుంబానికి అవసరం. కన్న కుమారుడితోనే సర్వం కోల్పోయామనీ, కుమారుడి కోసం అతని పేరుతో స్కూల్‌ని నిర్మించేందుకే మొత్తం ఆస్తిపాస్తుల్ని వెచ్చించామనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని బాధితుడి భార్య చెప్పారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com