ఎనిమిదేళ్ల తర్వాత చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్నాగిరి..

- July 13, 2016 , by Maagulf
ఎనిమిదేళ్ల తర్వాత చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్నాగిరి..

ఇదివరకు 'దిల్‌', 'ఆంధ్రావాలా', 'సై', 'నా అల్లుడు' వంటి చిత్రాలను నిర్మించిన గిరి (ఎ.ఎల్‌.ఎన. రెడ్డి) చాలా కాలం తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణరంగంలోకి వచ్చారు. కొత్తగా వైనతేయ ప్రొడక్షన్స ప్రై. లిమిటెడ్‌ బేనర్‌ను నెలకొల్పారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ''ఎనిమిదేళ్ల తర్వాత చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్నా. పరిశ్రమ దారుణంగా ఉంది. నిర్మాతల్ని బతకనిచ్చే పరిస్థితి లేదు. అయినా చూద్దామని ఇందులో దిగుతున్నా. ఇటీవల 'అర్ధనారి' సినిమాను విడుదల చేశాను. ఆ సినిమాకు పనిచేసిన టీమ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నా. వచ్చే నెల నుంచి షూటింగ్‌ జరుపుతాం. ఎవరైనా మంచి కథతో, 30 శాతం పెట్టుబడితో వస్తే నేను మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు 70 శాతం పెట్టుబడితో చిత్రాన్ని నిర్మించి, నేనే విడుదల చేస్తాను'' అని చెప్పారు. 'అర్ధనారి' దర్శకుడు భానుశంకర్‌ మాట్లాడుతూ తమ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కావడానికి గిరి సాయం చేశారన్నారు. రూ. 500 కోట్లను సినీ పరిశ్రమలో పెట్టుబడి పెడుతున్నామని మరో నిర్మాత సిరాజుద్దీన తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత యు. లావణ్యారెడ్డి, 'అర్ధనారి' హీరో హీరోయిన్లు అర్జున యజత, మౌర్యాని తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com