మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు
- July 14, 2015
పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదంపై మీడియాతో మాట్లాడుతూకంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందన్న ఆయన, ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దారుణ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల సూచనల ప్రకారం భక్తులు వ్యవహరించాలన్నారు. అందరూ ఒకేసారి ఘాట్ల వద్దకు రావద్దని చంద్రబాబు సూచించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







