బహ్రెయిన్ లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య

- July 14, 2015 , by Maagulf
బహ్రెయిన్  లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య

బహ్రెయిన్ లో అమలులో ఉన్న ఆరుబయట విధుల నిషేధాన్ని అతిక్రమించిన మరో 26 కంపెనీలు న్యాయ విచారణను ఎదుర్కోనున్నాయి. కార్మిక శాఖమంత్రి, శ్రీ జమీల్ హమైదాన్ ఈ ఆదివారం వివిధ కంపెనీలను దర్శించి అక్కడ సమయనిబంధనలు సరిగా అమలౌతున్నదీ లేనిదీ పర్యవేక్షించారు. 9 రోజుల్లో మొత్తం 2461 సంస్థలను తనిఖీచేసిన కార్మికశాఖ అధికారులు 133 మంది శ్రామికులు నిషేధిత సమయాల్లో ఆరుబయట విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అండర్ సెక్రటరీ సాబా అల్ డోస్సరీ తెలియజేశారు. మనామా, సీఫ్ మరియు ఇశా పట్టణాలలోని కొతగా రిజిస్టార్ ఐన కoపెనీలనుoడి ఈ కేసులు నమోదయ్యాయని, అక్కడ చదువుకొనివారు, కొత్తగా చేరినవారికి ఈ నిబంధనలను గురించిన అవగాహన లేదన్నారు, ఈ నిబంధన మీరిన వారికి 500 నుండి 1000 ఒమానీ రియాల్ల జరిమాన ఉంటుందని, ఇది గృహ పనివారలకు కూడా వర్తిస్తుoదని ఆయన తెలిపారు. 


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com