మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. అదుపునకు 6గంటలపాటు ఆపరేషన్..!!

- June 14, 2025 , by Maagulf
మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. అదుపునకు 6గంటలపాటు ఆపరేషన్..!!

యూఏఈ: దుబాయ్‌లోని మెరీనాలోని 67 అంతస్తుల ఎత్తైన భవనంలో శుక్రవారం రాత్రి సంభవించిన మంటలను అధికారులు అదుపు చేశారని దుబాయ్ మీడియా ఆఫీస్ (DMO) వెల్లడించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను ఆర్పడానికి ఆరు గంటలు అవిశ్రాంతంగా శ్రమించాయి. ప్రత్యేక విభాగాలు మెరీనా పినాకిల్‌లోని 764 అపార్ట్‌మెంట్‌ల నుండి 3,820 మంది నివాసితులను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తరలించారు.

శనివారం తెల్లవారుజామున 2.21 గంటలకు, విజయవంతమైన తరలింపు ప్రయత్నాల గురించి DMO మరిన్ని వివరాలను తెలిపింది. బాధిత నివాసితుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ..వారికి తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఇప్పుడు భవనం డెవలపర్‌తో కలిసి పనిచేస్తున్నారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత కూడా టవర్ నుండి పొగ ఇంకా పైకి లేచినట్లు పలువురు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

మెరీనా పినాకిల్.. దీనిని టైగర్ టవర్ అని కూడా పిలుస్తారు. అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. మే 25, 2015న 47వ అంతస్తులో వంటగదిలో జరిగిన ఒక సంఘటనలో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ వారు అదుపులోకి తీసుకునే లోపు అది 48వ అంతస్తుకు వ్యాపించింది. 67 అంతస్తుల మెరీనా పినాకిల్ ది టార్చ్ సమీపంలో ఉంది.ఇది 2015, 2017లో రెండుసార్లు మంటల్లో చిక్కుకున్న మరో స్కైస్రేపర్. తాజా అగ్నిప్రమాదంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com