మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!
- June 15, 2025
మస్కట్: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నందున, కొనసాగుతున్న సంఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఒమన్ సుల్తానేట్ నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో.. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్రిక్తలు తగ్గించాలని పిలుపునిచ్చారు.
అలాగే, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
ఈ క్రమంలో ఇరాన్ నేడు(ఆదివారం-జూన్ 15) ఒమన్‌లోని మస్కట్‌లో జరగాల్సిన అమెరికాతో ఆరవ రౌండ్ అణు చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!