బహ్రెయిన్ లో కీలక విద్యుత్ ప్రాజెక్టుకు కింగ్ హమద్ ఆమోదం..!!
- June 16, 2025
మనామా: ప్రధాన విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు బహ్రెయిన్ ఆమోదంతెలిపింది. ఈ మేరకు 2025 నాటి చట్టం నంబర్ (26)ను రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధికారికంగా ఆమోదించారు. ఇది కొత్త విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (IsDB)తో బహ్రెయిన్ ఒప్పందానికి తాజాగా ఆమోదముద్ర వేశారు.
షురా కౌన్సిల్, ప్రతినిధుల మండలి రెండింటిచే ఆమోదించబడిన ఈ చట్టం.. 400 కిలోవోల్ట్‌లతో పనిచేసే కొత్త జస్రా విద్యుత్ కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ఒప్పందంలో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, ఏజెన్సీ ఒప్పందంతోపాటు బహ్రెయిన్ ప్రభుత్వం, IsDB మధ్య హామీ ఒప్పందం ఉన్నాయి. ఈ ఒప్పందాలపై మొదటగా సెప్టెంబర్ 9, 2024న సంతకాలు జరిగాయి.
కొత్త విద్యుత్ కేంద్రం దేశంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుందని, భవిష్యత్తు అభివృద్ధికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. చట్టం ప్రకారం.. ఒప్పందాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టే బాధ్యత ప్రధానమంత్రి, సంబంధిత మంత్రులకు ఉంది. ఈ చట్టం అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి అమలులోకి వస్తుందని అధికార వర్గులు తెలిపాయి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!