విశాఖలో యోగా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు
- June 16, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ‘యోగాంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకుంది.విశాఖపట్నం బీచ్ రోడ్డులో యోగా ప్రాంగణాన్ని తయారు చేస్తుండగా, సీఎం చంద్రబాబు అక్కడి వేదిక, వసతుల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి యోగా దినోత్సవానికి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి సమీక్షించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, “ప్రధాని మోదీ వచ్చేది చాలా గౌరవకరమైన విషయమని, విశాఖ ప్రతిష్టను మరింత పెంచే ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని” అధికారులకు సూచించారు.‘యోగాంధ్ర’ పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.అలాగే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
607 సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరవుతున్నారని, వారిని సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా (Mock yoga) నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 గంటల నుంచి 8:00 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఆర్కే బీచ్‌లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!