షుగర్ని తగ్గించే ఈ రొట్టెని ఈజీగా చేసుకోం
- June 16, 2025
రెగ్యులర్ చపాతీలకంటే జొన్న రొట్టెలు మంచివని అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల బరువు తగ్గడం నుంచి ఎన్నో లాభాలు ఉంటాయి.అయితే, నార్మల్ జొన్నరొట్టె కంటే మరింత టేస్టీగా ఉండేలా జొన్నరొట్టెను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.పెరిగిన అవగాహన కారణంగా ఎక్కువగా అన్నం బదులు చపాతీలనే తింటున్నారు.అది కూడా గోధుమ చపాతీల బదులు మరో అడుగు ముందుకేసి జొన్న రొట్టెల్ని తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ జొన్నరొట్టెలు తింటే బరువు తగ్గడం, షుగర్ తగ్గడం నుంచి జీర్ణక్రియ మెరుగ్గా మారి దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దీనికి కారణం జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ గుణాలు. అయితే, నార్మల్ చపాతీలను చేయడమే కొందరికీ కష్టంగా ఉంటుంది. అలాంటి వారు జొన్న రొట్టెలు చేయొచ్చా, అది కూడా మసాలా జొన్నరొట్టెలా మా వల్ల కాదు అనుకోవదు. ఇవి చేయడం చాలా ఈజీ. పైగా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒక్కోసారి కూరలు లేకపోయినా తినేయొచ్చు. మరి కావాల్సిన పదార్థాలు, తయారుచేసే విధానమేంటో తెలుసుకోండి.
ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో నీరు పోసి వేడి చేయండి.తర్వాత అందులో జీలకర్రని కాస్తా నలిపి వేయండి. నువ్వులు కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు కప్పు జొన్న పిండి వేయండి. అందులోనే తరిగిన కొత్తిమీర వేయండి. కొద్దిగా మిరియాల పొడి వేయండి. అన్నింటిని కలిపి మూతపెట్టి 5 నిమిషాలు ఉంచండి. తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని బాగా ఒత్తి చపాతీ పిండిలా చేయండి. ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసి అలానే ఉంచండి. 10 నిమిషాల తర్వాత పిండిని ముద్దల్లా చేయండి. పిండి ఆరిపోకుండా తడిగుడ్డతో కప్పండి. ఒక్కో పిండి ముద్దని తీసుకుని రోటీల్లా ఒత్తుకోండి. జొన్న రోటీలను పెనంపై వేసి రెండువైపులా కొద్దిగా కాల్చి నేరుగా మంటపై కాల్చండి. దీంతో చక్కగా పొంగుతాయి. వీటిని తీసి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి రాయండి. ఇలా తయారైన చపాతీలను మీకు నచ్చిన కూరతో ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం