ఢిల్లీ టిటిడి కళాశాలలో వృత్తి కోర్సులు
- June 17, 2025
ఢిల్లీ టిటిడి కళాశాలలో వృత్తి కోర్సులు
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీనగరంలో తిరుమలతిరుపతి దేవ స్థానం నడుపుతున్న శ్రీవేంకటేశ్వర కళాశాలలో విద్యార్థులకు ఉపాధి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు సూచించారు.కళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఎస్వీకళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని ఢిల్లీలోని ఎస్వీ కళాశాల 155వ సమావేశం తిరుపతిలోని పద్మావతి అతిధి గృహంలో టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు, ఈఒ శ్యామలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి టిటిడి బోర్డుసభ్యులు డాక్టర్ పనబాకలక్ష్మి, శాంతారాం, ఎస్.నరేశ్ కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, టిటిడి ఎఫ్ఎసిఎఒ బాలాజీ, సిఇ సత్యనారా యణ, టిటిడి డిఇఒ వెంకటసునీల్, గవర్నింగ్ బాడీ ప్రతినిధులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో బిఆరా నాయుడు మాట్లాడుతూ ఢిల్లీలోని కళాశాలలో టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఎస్వీకళాశాలను రూపొందించాలన్నారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వీకళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉత్తరాదివైపున ఉన్న టిటిడి ఆలయాల్లో, ఢిల్లీలోని ఎస్వీకళాశాలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఇఇ విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఛైర్మన్ నాయుడు ఈఒ శ్యామలరావుకు సూచించారు.కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగ పోటీపరీక్షలకు శిక్షణ నిచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
కళాశాలలో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. కాలంచెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్నిర్మాణం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో కళాశాల ప్రవేశాలలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులుచేర్పులు చేపట్టాలన్నారు. కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వఝుల రవి ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఒ దృష్టికి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







