మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

- July 14, 2015 , by Maagulf
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

 పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదంపై మీడియాతో మాట్లాడుతూకంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందన్న ఆయన, ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దారుణ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

 తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల సూచనల ప్రకారం భక్తులు వ్యవహరించాలన్నారు. అందరూ ఒకేసారి ఘాట్ల వద్దకు రావద్దని చంద్రబాబు సూచించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com