బాధితులను పరామర్శించిన జగన్
- July 14, 2015
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడ పర్యటనను సగంలోనే ముగించుకుని హుటాహుటిన రాజమండ్రి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. పుష్కరానికి వచ్చి మృతిచెందిన భక్తుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులను ఆయన పరామర్శించారు. యాత్రికుల మృతి విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రి కోటిలింగాల రేవు పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందడంతో పాటు మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని తక్షణం అందజేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







