సౌదీ అరేబియాలో 700 కి పైగా కొత్త ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తింపు..!!

- June 18, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 700 కి పైగా కొత్త ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తింపు..!!

రియాద్: జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్‌లో 744 కొత్త పురావస్తు ప్రదేశాలు నమోదు అయినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది.  దీంతో ఆర్కియాలజికల్ సైట్స్ సంఖ్య మొత్తం 10,061కి చేరుకుందన్నారు. ఈ మైలురాయి సౌదీ అరేబియా సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని,  వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. 

కొత్తగా నమోదు చేయబడిన సైట్లు రియాద్ (253), మక్కా (11), మదీనా (167), ఖాసిమ్ (30), తూర్పు ప్రావిన్స్ (13), అసిర్ (64), తబుక్ (72), హైల్ (13), ఉత్తర సరిహద్దులు (2), జజాన్ (23), నజ్రాన్ (86), అల్-జౌఫ్ (10) వంటి రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని వెల్లడించారు.

బాలాగ్ ప్లాట్‌ఫామ్, అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లు లేదా 911 వద్ద యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా నమోదు చేయని సైట్‌ల వివరాలను అందజేయడం  ద్వారా తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని హెరిటేజ్ కమిషన్ పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com