యూఏఈలో పెరుగుతున్న వీసా పొడిగింపు దరఖాస్తులు..!!
- June 19, 2025
యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తులు పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జోర్డాన్, లెబనాన్ తోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని అన్నారు. వారి ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తమ వీసా గడువును పొడిగించుకోవాలని అందరూ దరఖాస్తులు చేస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో చాలా మంది స్వల్పకాలిక సందర్శన వీసాపై వచ్చారు. కానీ ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు లేదా స్వదేశానికి వెళ్లేందుకు భద్రతా సమస్యల కారణంగా మరింత కాలం యూఏఈలో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని తెలిపారు. వీసా పునరుద్ధరణలు, పొడిగింపుల గురించి తన ఏజెన్సీకి రోజువారీగా విచారణలు అందుతున్నాయని ఐదాసాని అన్నారు.
వైజ్‌ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. జోర్డాన్, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల నుండి యూఏఈ వచ్చిన పర్యాటకులు.. తమ వేసవి సెలవులను మరికొన్ని రోజులపాటు పొడిగించుకుంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







