ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో కోత

- June 19, 2025 , by Maagulf
ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో కోత

ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా,తన అంతర్జాతీయ వైడ్‌బాడీ విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గించనుందని ప్రకటించింది.బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, జూలై మధ్య వరకు సుమారు 15% సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ప్రయాణికుల భద్రత ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది.విమానాల్లో ప్రయాణించే వారికి అత్యధిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో, ఎయిరిండియా తన బోయింగ్ 777 వర్గంలోని వైడ్‌బాడీ విమానాలకు ప్రత్యేకంగా భద్రతా తనిఖీలు చేపట్టనుంది. ఈ చర్యలు మరింత పటిష్టమైన ప్రయాణ భద్రత కోసం తీసుకుంటున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఈ సంస్థ, ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడదని స్పష్టం చేసింది.

ఆరు రోజుల్లో 83 అంతర్జాతీయ విమానాలు రద్దు
గత కొన్ని వారాలుగా ఎయిరిండియాకు నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవలి ఆరు రోజుల్లో సంస్థకు చెందిన 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దైన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనప్పటికీ, భద్రతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ స్పష్టం చేస్తోంది.

ప్రయాణికులకు ఎయిరిండియా సూచన
తమ ప్రయాణ సమయాల్లో మార్పులు ఉంటే, వెంటనే ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది.ప్రయాణ వివరాల్లో స్పష్టత కోసం ముందుగానే సమాచారాన్ని తెలుసుకోవాలని కోరింది. సర్వీసుల తగ్గింపుతో కొంత అసౌకర్యం తప్పకపోయినా, భద్రత విషయమై ఎలాంటి సంశయం లేకుండా చూసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com