ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించడానికి ఒమన్ ప్రయత్నాలు..!!

- June 19, 2025 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించడానికి ఒమన్ ప్రయత్నాలు..!!

మస్కట్: ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన కార్యకలాపాలను ఒమన్ ప్రారంభించింది. గాజా, ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులతో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఒమన్ విదేశాంగ మంత్రి హిజ్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ అల్ బుసైది.. జర్మన్ విదేశాంగ మంత్రి అధికారిక పర్యటన సందర్భంగా మస్కట్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రాంతీయ సంక్షోభంపై వారు చర్చించారు.  ముఖ్యంగా గాజాలో నిరంతర హింస, విధ్వంసంతో పాటు  అనేక మంది ప్రాణనష్టానికి కారణమైన ఇజ్రాయెల్.. తాజాగా  ఇరానియన్ మౌలిక సదుపాయాలపై దాడుల చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. 

అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించడం, జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించడంతోపాటు రెండు-స్టేట్స్ పరిష్కారానికి మద్దతును తిరిగి పెంచడం అత్యవసరమని ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు పాలస్తీనా రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపును విస్తృతం చేయడం, ప్రాంతీయ స్థిరత్వానికి ఏకైక అనుసరణీయ మార్గం అని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో అల్-బుసైది మిత్ర దేశాల విదేశాంగ మంత్రులతో వరుసగా ఫోన్ కాల్స్ చేస్తూ.. ఇజ్రాయెల్ కార్యకలాపాలను నిలిపివేయడానికి అవసరమైన రాజకీయ ఒత్తిడి కోసం కృషి చస్తున్నారు. ఈ ప్రయత్నాలు శాంతి, న్యాయం, అంతర్జాతీయ చట్టానికి మద్దతుగా ఒమన్ వైఖరిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణను అరికట్టడానికి ఒమన్ తన బలమైన దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది.  ఒమన్ సైనిక, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండించింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్య మార్గంలో ప్రయాత్నించాలని సూచించింది.   

ఇజ్రాయెల్ దురాక్రమణదారు అని, UN చార్టర్‌ను ఉల్లంఘిస్తోందని మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అం అణు విస్తరణను నిరోధించే లక్ష్యంతో అమెరికా-ఇరానియన్ చర్చలు సహా శాంతి ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ముందస్తు కాల్పుల విరమణ చాలా ముఖ్యమైనదని పిలుపునిచ్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com