అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!
- June 20, 2025
దోహా: ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి హెచ్ ఇ షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థాని న్యూయార్క్లోని ఖతార్ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడు హెచ్ హెచ్ ప్రిన్స్ జీద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ను కలిశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే గాజాలో మానవీయ సాయాన్ని అందించే విషయమై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!







