ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలి..ఒమన్
- June 22, 2025
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్‌లో జరిగిన అరబ్ దేశాల లీగ్ కౌన్సిల్ అసాధారణ సమావేశంలో పాల్గొన్న ఒమన్ సుల్తానేట్.. ఇరానియన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి దౌత్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ నేతృత్వం వహించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను సమావేశం ఖండించింది. ఇది UN సభ్య దేశ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు అని ఆక్షేపించింది. ఈ దురాక్రమణను ఆపాలని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలను ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందని తెల్చిచెప్పింది.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ