నిరుద్యోగులకు TGSRTC శుభవార్త

- June 22, 2025 , by Maagulf
నిరుద్యోగులకు TGSRTC శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక శుభవార్త! టీజీఎస్ఆర్టీసీ వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇది ఒక తాత్కాలిక నియామకం అయినప్పటికీ, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం కలుగనుంది. ముఖ్యంగా, పదో తరగతి వరకు చదివినవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు కావడం విశేషం.

మొత్తం ఖాళీలు:
ఈ నియామక ప్రక్రియలో 800 కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 800 హైదరాబాద్ రీజియన్‌ – 600 పోస్టులు, వరంగల్ రీజియన్‌ – 200 పోస్టులు ఇవన్నీ ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుండగా, నియామక ప్రక్రియను సంబంధిత ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా చేపడతారు.

అర్హత:
కనీస విద్యార్హత: 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇతర అర్హతలు, వయోపరిమితి మొదలైన వివరాలు త్వరలో విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

జీతం:
నెలకు రూ.17,969 వేతనం

అదనంగా, ఓవర్‌టైం పని చేస్తే గంటకు రూ.100 చొప్పున అదనపు పారితోషికం అందుబాటులో ఉంటుంది.

డ్యూటీ సమయం:
ప్రతి రోజూ 8 గంటలు ఎంపిక విధానం ఉద్యోగాల ఎంపిక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జరగనుంది.

దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తు ప్రక్రియ ఆర్టీసీ డిపోల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో చేపట్టే అవకాశం ఉంది. పూర్తి అర్హతలు, వయోపరిమితి, ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. కావున, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం మంచిది. సంబంధిత అప్డేట్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. ఇది తాత్కాలిక నియామకం అయినప్పటికీ, పని నైపుణ్యం ఆధారంగా భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగావకాశాలు కూడా ఉండొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి.హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ ప్రాంతాల్లోని నిరుద్యోగులకిది మంచి అవకాశం అని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com