అణుకేంద్రాలపై దాడులు.. రేడియేషన్ ఆందోళనలు.. యూఏఈ క్లారిటీ..!!
- June 23, 2025
యూఏఈ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నేపథ్యంలో తమ దేశంపై ఎటువంటి ప్రభావం చూపలేదని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ (FANR) తెలిపింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలకు సంబంధించిన పరిణామాలను సంబంధిత జాతీయ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. FANR అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)తో సహా అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తూ.. నిరంతరం పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లు ఇతర వార్తలపై స్పందించవద్దని ప్రజలను కోరింది.
అంతకుముందు, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఈ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలను నివారించడానికి దాడులను వెంటనే నిలిపివేయాలని యూఏఈ కోరింది. అమెరికా దాడులపై ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రంగా ఖండించాయి.
యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం..ఇటువంటి చర్యలు ఈ ప్రాంతాన్ని అస్థిర పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గల్ఫ్ సహకార మండలి జనరల్ సెక్రటేరియట్ కూడా ఇప్పటివరకు ఏ GCC దేశాలలోనూ "అసాధారణ రేడియేషన్ స్థాయిలు" గుర్తించలేదని పేర్కొన్నది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!