విద్యుత్, నీటి ప్రాజెక్టులపై కువైట్ ప్రధాన మంత్రి సమీక్ష..!!
- June 24, 2025
కువైట్: వ్యూహాత్మక ఇంధనం, నీటి డీశాలినేషన్ ప్రాజెక్టులపై తాజా డెవలప్ మెంట్ పై బయాన్ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా సమీక్షించారు. షాగయా, అల్-అబ్దాలియా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అలాగే అల్-జోర్ నార్త్ (దశ 1 , 2), అల్-ఖిరాన్ ఫేజ్ 1, అల్-నువైసీబ్ ఫేజ్ 1, సుబియా విస్తరణ విద్యుత్ ప్లాంట్లు వంటి కీలకమైన భవిష్యత్ వెంచర్లపై చర్చించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వనరులను ఉపయోగించుకోవడం ద్వారా అడ్డంకులను అధిగమించాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి దివాన్ అధిపతి అబ్దులాజీజ్ అల్-దఖీల్, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రి డాక్టర్ సుబైహ్ అల్-ముఖైజిమ్, మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!