ID చోరీ, డీప్‌ఫేక్‌లు ప్రాణాలను బలిగొంటాయి.. దుబాయ్ నిపుణులు హెచ్చరిక..!!

- June 26, 2025 , by Maagulf
ID చోరీ, డీప్‌ఫేక్‌లు ప్రాణాలను బలిగొంటాయి.. దుబాయ్ నిపుణులు హెచ్చరిక..!!

యూఏఈ: కృత్రిమ మేధస్సు(ఏఐ) సాధనాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నందున ఐడీ దొంగతనం, బయోమెట్రిక్ స్పూఫింగ్, ఆరోగ్య సంరక్షణ మోసానికి పాల్పడేందుకు AI ఇప్పుడు ఎలా ఆయుధాలుగా మారుతుందో సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరించారు. బుధవారం దుబాయ్‌లో ఫ్యూచర్‌సెక్ సమ్మిట్ 2025 జరిగింది. ఆరోగ్య సంరక్షణ, రిటైల్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని డీప్‌ఫేక్‌లు, మోసపూరిత గుర్తింపులు,  డిజిటల్ మౌలిక సదుపాయాలలో చోటుచేసుకుంటున్న మార్పులు, కంపెనీలతోపాటు వ్యక్తులను ఎలా తీవ్రమైన ప్రమాదానికి గురిచేస్తున్నాయో హైలైట్ చేశారు.
"డిజిటల్ గుర్తింపు ప్రపంచంలో ఇది కేవలం ఒక సమస్య కాదు. ఇది ప్రాణాపాయం కలిగించే పరిణామాలను కలిగి ఉంది.మీరు ఒక రోగిని తప్పుగా గుర్తిస్తే, అది గుర్తింపు దొంగతనం ద్వారా లేదా లోపం ద్వారా అయినా, అది తప్పు ఔషధం ఇవ్వబడటానికి లేదా తప్పు నిర్ధారణకు దారితీయవచ్చు." అని సిగ్నా హెల్త్‌కేర్ MEA చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ జేమ్స్ వైల్స్ అన్నారు.  సైబర్ నేరస్థులు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికా అంతటా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో, మోసపూరిత బీమా క్లెయిమ్‌లను సమర్పించడానికి నకిలీ గుర్తింపులను ఎలా ఉపయోగిస్తున్నారో వైల్స్ వివరించారు. "వ్యక్తిగత డేటా రక్షణపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 45, సైబర్ నేరాలపై నంబర్ 34 వంటి చట్టాలు మా వద్ద ఉన్నాయి. ఇవి మాకు బలమైన పునాదిని ఇస్తాయి" అని ప్రభుత్వ సంస్థ సైబర్ సెక్యూరిటీ లీడ్ మాథ్యూ అన్నారు.  

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com