పవిత్ర కాబా కిస్వా రిప్లెస్మెంట్ ప్రారంభం..విశేషాలు..!!

- June 26, 2025 , by Maagulf
పవిత్ర కాబా కిస్వా రిప్లెస్మెంట్ ప్రారంభం..విశేషాలు..!!

మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదులో పవిత్ర కాబా కిస్వా (కవర్)ను రిప్లేస్ చేసే వార్షిక వేడుక బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రారంభమైంది.పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దులాజీజ్ కాంప్లెక్స్ ద్వారా గ్రాండ్ మసీదు,  ప్రవక్త మసీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ, ఒక శతాబ్దానికి పైగా నిర్వహిస్తున్న సంప్రదాయం ప్రకారం.. కిస్వాను రిప్లేస్ చేసే వేడుకను చేపట్టారు.

కొత్త హిజ్రీ సంవత్సరం మొదటి రోజు గురువారం ఉదయం నాటికి కిస్వాను రిప్లెస్ చేయనున్నారు. జూన్ 8న జరిగిన ఒక కార్యక్రమంలో మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ కొత్త కిస్వాను గ్రాండ్ మసీదు సీనియర్ కీపర్ అబ్దుల్ మాలిక్ బిన్ తహా అల్-షైబికి అందజేశారు.

కొత్త కిస్వాను పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దులాజీజ్ కాంప్లెక్స్ బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన సహజ నల్ల-రంగు పట్టును ఉపయోగించి తయారు చేసింది. కాంప్లెక్స్ నుండి అధికారులు, ఉద్యోగులు 6.35 మీటర్ల పొడవు, 3.33 మీటర్ల వెడల్పు కలిగిన కాబా తలుపు నుండి బంగారు పూత పూసిన కర్టెన్‌ను తొలగించడం ద్వారా, అలాగే షాన్డిలియర్‌లు .. అలంకార ఆభరణాలను తొలగించడం ద్వారా వేడుకను ప్రారంభించారు.  154 మంది శిక్షణ పొందిన కళాకారులతో కూడిన పూర్తిగా సౌదీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. మొత్తం కిస్వా బరువు సుమారు 1,415 కిలోగ్రాములు ఉంటుంది.

కొత్త కిస్వాను రూపొందించడానికి, బృందం 120 కిలోగ్రాముల బంగారు పూత పూసిన వెండి దారం, 60 కిలోగ్రాముల స్వచ్ఛమైన వెండి, 825 కిలోగ్రాముల పట్టు, 410 కిలోగ్రాముల స్వచ్ఛమైన పత్తిని ఉపయోగించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com