దుబాయ్ లో భారతీయ వ్యాపారి హత్య కేసు..ఐదుగురి పై విచారణ ముమ్మరం..!!
- June 28, 2025
దుబాయ్: దుబాయ్ లోని అల్ వుహైదా ప్రాంతంలోని విల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలో 55 ఏళ్ల భారతీయ వ్యాపారిని చంపిన ఐదుగురు వ్యక్తుల కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారించడం ప్రారంభించింది.
కోర్టు ఫైళ్ల ప్రకారం.. నిందితులు అందరూ పాకిస్తాన్ జాతీయులు. బాధితుడి విల్లాలోకి చొరబడి, అతన్ని కట్టివేసి, పదునైన వస్తువుతో గొంతు కోసి చంపారని కేసులు నమోదు చేశారు. అక్కడి నుండి నగదు, పాస్‌పోర్ట్‌లు, ఆభరణాలను చోరీ చేశారని తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణులు, CID అధికారులతో సహా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విల్లాలోని భద్రతా కెమెరాల ఫుటేజ్‌లో నేరం జరిగిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు ప్రవేశించినట్లు కనిపించింది. ఇరవై నిమిషాల తర్వాత, వారు చోరీ సొత్తుతో వెళ్లడం కనిపించింది. కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో బాధితుడికి అనేక గాయాలు అయ్యాయని, దాడి చేసిన వారిని ప్రతిఘటించిన తర్వాత చివరికి గొంతు కోసి చంపబడ్డాడని నిర్ధారించారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పాకిస్తాన్ లోని విమానాశ్రయంలో మరో ఇద్దరిని అరెస్టు చేసి, తరువాత యూఏఈకి తీసుకొచ్చారు. విచారణ సమయంలో ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







