‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- June 28, 2025
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మెప్పించారు. ఇటీవల VFX పనులు ఇంకా అవ్వలేదని సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. హరిహర వీరమల్లు ట్రైలర్ ని జులై 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాబీ డియోల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా