హిస్టరీ క్రియేట్ చేసిన స్మృతి మంధాన..
- June 28, 2025
భారత మహిళా స్టార్ స్టేయర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి T20లో తన తొలి టీ20 అంతర్జాతీయ శతకాన్ని బాదిన మంధాన, మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
మంధాన 51 బంతుల్లోనే శతకం సాధించగా, మొత్తం 62 బంతుల్లో 112 పరుగులు (15 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్ భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె, ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. పవర్‌ప్లే నుంచే అటాకింగ్ మూడ్‌లోకి వెళ్లిన మంధాన, బౌండరీల వర్షం కురిపించి ప్రత్యర్థులపై ఒత్తిడి తలపెట్టింది.
అంతేకాకుండా, రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన నేపథ్యంలో… మంధానకు తాత్కాలిక నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ఆమె స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా కూడా జట్టును అద్భుతంగా నడిపించింది. ఈ మ్యాచ్‌లో, భారత్ జట్టు రెండవ అత్యధిక టీ20I స్కోరు 210/5ని నమోదు చేసింది.
ఈ ఇన్నింగ్స్ తో మంధాన తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకోవడమే కాకుండా భారత మహిళా క్రికెట్ కు స్ఫూర్తిదాయక నాయకురాలిగా నిలిచింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఆమె పేరు ఇప్పుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







