ఖతార్ ప్రవాసీయుల కోసం ప్రత్యేక ఈద్ సంబరాలు
- July 14, 2015
ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం మొదటి రెండురోజుల్లో దేశంలోనన్న ప్రవాసీయులకోసం కతార్ ఆంతరంగిక శాఖ వారు ఏషియన్ టౌన్ మరియు వార్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వారి సహకారంతో వివిధ సాంస్కృతిక, క్రీడా మరియు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈశాఖ ప్రజా సంబంధాల డైరక్టర్ కల్నల్ అబ్దుల్లా ఖలీఫా అల్ ముఫ్తా చెప్పారు. అల్ ఖోర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో - 4 ఫుట్బాల్ గ్రౌండ్లు, 4 క్రికెట్ గ్రౌండ్లు, 4 వాలీబాల్ గ్రౌండ్లు, 3 బ్యాస్కెట్బాల్ కోర్టులు, 4 కబాడీ మైదానాలు, రెండు ఓపెన్ ఏర్ సినేమా థియేటర్లు, ఒక మసీదు, 35 షాపులు మరియు ఒక హైపర్ మార్కెట్ గల బర్వా వర్కార్స్ రిక్రియేషన్ కాంప్లెక్స్ లో ఈ సంబరాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా, 6 టీములతో ఏర్పాటు చేయనున్న క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఆకర్షణ అని, ఇండియా మరియు నేపాలీస్ వారి అర్కేస్త్రా, రమదాన్ ఛాంపియన్షిప్ 2015లో భాగంగా వాలీబాల్ మరియు క్రికెట్ టోర్నమెంట్ల ఫైనల్స్ ఇంకా మరిన్ని కార్యక్రమాలతో అలరించనున్నామని ఆయన తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







