దుబాయ్ లో కార్మికులకు ఉచితంగా చల్లని నీరు, ఐస్ క్రీమ్స్ పంపిణీ..!!
- June 29, 2025
యూఏఈ: దుబాయ్ సౌత్‌లోని అజీజీ వెనిస్‌లో వందలాది మంది నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు చల్లని నీరు, ఐస్ క్రీం, జ్యూసులను అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ అనే స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్నది. ఇది సమ్మర్ హీట్ వేవ్స్ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.వేసవిలో ఎమిరేట్ అంతటా కార్మికులకు రెండు మిలియన్ల రిఫ్రెష్‌మెంట్‌లను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ చొరవకు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ మద్దతు ఇస్తుందన్నారు. సుకియా , యూఏఈ ఫుడ్ బ్యాంక్ సహకారంతో ఫెర్జాన్ దుబాయ్ ప్రారంభించింది.
బంగ్లాదేశ్‌కు చెందిన స్టీల్ ఫిక్సర్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ.. “నేను ఆరు సంవత్సరాలుగా దుబాయ్‌లో పనిచేస్తున్నాను. సమ్మర్ లో చల్లని జ్యూసులు, ఐస్ క్రీములు ఒక వరంలా అనిపిస్తుంది. ఇది మాకు ముందుకు సాగడానికి శక్తిని ఇస్తుంది.” అని అన్నారు. ఈ సమ్మర్ లో ఇలాంటి చొరవలు కార్మికులకు మేలు చేస్తుందని, అలసిపోయిన తమకు ఇది సాంత్వన చేకూర్చుతుందని నేపాల్‌కు చెందిన లాల్ బహదూర్ అన్నారు.
ఆగస్టు 23 వరకు జరిగే అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ ప్రచారం దుబాయ్‌లోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతోందని ప్రకటించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







