తెలంగాణ: ఇక పై ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం పాఠాలు
- June 29, 2025
హైదరాబాద్: తెలంగాణ విద్యా రంగంలో ఓ సానుకూలమైన మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సంగీతాన్ని కూడా అభ్యసించే అవకాశాన్ని పొందనున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని పలు పాఠశాలలు కొత్త దిశలో పయనించనున్నాయి.
ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 794 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యవిషయాలతో పాటు సంగీత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
దీనిలో భాగంగా ఒక్కో పాఠశాలకు ఐదేళ్లలో రూ.కోటి నుంచి రూ.2.25 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు ల్యాప్టాప్లు, క్రీడా సామగ్రి అందజేశారు. తాజాగా 270 హైస్కూల్లకు సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ పరికరాలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్) టెండర్ల ద్వారా సరఫరా చేసింది.
అయితే సంగీత పాఠాలు నేర్పే టీచర్ల నియామకంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పాఠశాలకో టీచర్ను నియమించడానికి నెలకు రూ.10 వేల చొప్పున 6 నెలలకు రూ.60 వేలు కేటాయించారు. అయితే వాయిద్యాలను నేర్పించడానికి ప్రత్యేక టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించి, కార్యాచరణ రూపొందించేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!