సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో తగ్గిన నిరుద్యోగం..!!

- June 30, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో తగ్గిన నిరుద్యోగం..!!

రియాద్: జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం,.. సౌదీ జాతీయులలో నిరుద్యోగ రేటు 2025 మొదటి త్రైమాసికంలో అత్యంత కనిష్ట స్థాయిలో 6.3%కి తగ్గింది. ఇది సౌదీ డేటాను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి అత్యల్ప స్థాయిఅని తెలిపారు. లేబర్ మార్కెట్లో సౌదీ మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ చారిత్రాత్మక తగ్గింపు సాధ్యమైందని పేర్కొన్నారు.  

మహిళా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 10.5%కి తగ్గింది. ఇది సంవత్సరానికి 3.6 శాతం పాయింట్లు చొప్పున తగ్గింది. సౌదీ మహిళలలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 0.3 శాతం పాయింట్లు పెరిగి 36.3%కి చేరుకుంది. ఉపాధి-జనాభా నిష్పత్తి 0.7 శాతం పాయింట్లు పెరిగి 32.5%కి చేరుకుంది. సౌదీ పురుషులలో నిరుద్యోగ రేటు(4.0%) కూడా తగ్గుముఖం పట్టింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 0.2 శాతం పాయింట్లు తగ్గింది.

సౌదీలు, సౌదీయేతరులు ఇద్దరూ సహా విస్తృత కార్మిక మార్కెట్లో.. మొత్తం నిరుద్యోగ రేటు 2025 మొదటి త్రైమాసికంలో 2.8%కి తగ్గింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 3.5%గా ఉంది. దశాబ్దం చివరి నాటికి సౌదీ నిరుద్యోగాన్ని 7%కి తగ్గించాలని మొదట్లో ప్రతిష్టాత్మకమైన విజన్ 2030 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది 2024 చివరి నాటికి షెడ్యూల్ కంటే ముందే లక్ష్యాన్ని అధిగమించింది. ఫలితంగా, ప్రభుత్వం 2030 నాటికి తన లక్ష్యాన్ని 5%కి తగ్గించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com