యూఏఈలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!
- June 30, 2025
యూఏఈ: జూలై నెలకు సంబంధించిన ఇంధన ధరలను యూఏఈ ప్రకటించింది. జూన్, మే నెలలో స్థిరంగా కొనసాగిన ఇంధన ధరలు, జులై నెలలో కాస్తా పెరిగాయి.ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య వివాదం నేపథ్యంలో ఇంధన ప్రపంచ చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం యూఏఈలో పెట్రోల్ ధరలపై పడింది. దాంతో జూలైలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
జూలై 1 నుండి కొత్త ధరలు వర్తిస్తాయి. ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
-జూన్‌లో Dh2.58 ధరతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ లీటరుకు Dh2.70 ధరతో ప్రారంభమవుతుంది.
-ప్రస్తుత Dh2.47 ధరతో పోలిస్తే స్పెషల్ 95 పెట్రోల్ లీటరుకు Dh2.58 ధరతో ప్రారంభమవుతుంది.
-జూన్‌లో E-ప్లస్ 91 పెట్రోల్ లీటరుకు Dh2.39 ధర ఉండగా, అది ఇప్పడు Dh2.51 ధరతో ప్రారంభమవుతుంది.
-ప్రస్తుత Dh2.45 ధరతో పోలిస్తే డీజిల్ లీటరుకు Dh2.63 ధరను వసూలు చేయనున్నారు.
2015లో యూఏఈ పెట్రోల్ ధరలను ప్రభుత్వ నియంత్రణ నుండి ఉపసంహరించింది. ప్రపంచ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి నెలా చివరిలో ధరలను సవరిస్తారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!