బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతి ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ స్కీం..

- July 01, 2025 , by Maagulf
బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతి ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ స్కీం..

ఇంటర్ చదవబోతున్న విధ్యార్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వారికి భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ సంస్థ “భారతి ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025–26″ ద్వారా స్కాలర్షిప్ అందిస్తోంది. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో ప్రతిభావంతులను తయారుచేసేందుకే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు. ఈ స్కీం లో భాగంగా విద్యార్థులకు ఫుల్ ఫీజ్, ఫ్రీ లాప్ టాప్, హాస్టల్ ఫెసిలిటీ, టీషన్ ఫీ ఇలా చాలా రకాల ప్రయోజనాలు అందనున్నాయి. కాబట్టి, ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధికారులు సూచించారు. దరఖాస్తు ఇప్పటికే మొదలవగా 31 జూలై 2025తో ముగియనుంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అర్హత:
2025‑26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం UG/ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం కలిగి ఉండాలి. అది కూడా ఇలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, టెలికాం, ఐటీ, సీఎస్, డేటా సైన్స్, ఎయిరో స్పేస్, AI/IoT/AR‑VR/Machine Learning/Robotics మొదలైన కోర్సుల వారు మాత్రమే దీనికి అర్హులు.

భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి.

  • కుటుంబ వార్షిక ఆదాయం ₹8.5 లక్షలకు మించి కాకూడదు
  • ఒకే కోర్సుకు ఇతర స్కాలర్‌షిప్‌లు కలిగి ఉండకూడదు.
  • ఈ స్కాలర్షిప్ ప్రయోజనాలు:
  • ఫీజుల కవరీ: 5 సంవత్సరాల విధ్యా కాలానికి ఏడాది వారీగా 100% ట్యూషన్ ఫీజు అందిస్తారు.

హోస్టల్ & మెస్ ఫీజులు: యూనివర్సిటీ/కాలేజ్ హోస్టల్స్ ఆశిస్తే పూర్తి కవర్, లేదా ప్రైవేట్ పీజీ/హోస్టల్ ఉంటే యూనివర్సిటీ చార్జిల ఆధారంగా ఫీజులు చెల్లిస్తారు.

ల్యాప్‌టాప్: మొదటి సంవత్సరంలోనే లాప్ టాప్ అందిస్తారు.

కావలసిన ధ్రువపత్రములు:
ఆధార్ కార్డు, మార్క్‌షీట్, JEE/Entrance స్కోర్‌ కార్డ్, అడ్మిషన్ లెటర్, ఫీజు స్ట్రక్చర్, Income సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, SOP, PG/rent receipts (if applicable), ఫోటో.


అప్లికేషన్ విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://bhartifoundation.org/ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com