అక్టోబరులో షిరిడీ ఎయిర్‌పోర్టు ప్రారంభం..
- July 14, 2016
మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టును వచ్చే అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ త్వరలో ఆహ్వానిస్తారని మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వాస్ పాటిల్ తెలిపారు.
బుధవారం ఎయిర్‌పోర్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 900 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టుకు ఇప్పటి వరకు రూ.225 కోట్లను ఖర్చు చేశామని, ఇంకా వంద కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, సింగపూర్, దుబాయ్‌లతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చే యాత్రికులు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల ద్వారా నేరుగా షిరిడీ చేరుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







