శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్..

- July 05, 2025 , by Maagulf
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్..

శ్రీశైలం వెళ్లే భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవడం భక్తులు ఎంతో ఇష్టంగా భావిస్తారు. అయితే, గత ఆర్నెళ్ల క్రితం ఈ దర్శనాన్ని నిలిపివేశారు.ఈనెల 1వ తేదీ నుంచి ఉచిత స్పర్శ దర్శనంను పున: ప్రారంభించారు. ఈ క్రమంలో భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆన్‌లైన్‌లోనే ఉచిత స్పర్శ దర్శనం కోసం టోకెన్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మల్లన్న స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు అనుమతిస్తారు. ఈ నాలుగు రోజులు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనంకు అవకాశం కల్పిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఈ దర్శనం ఉండదని ఆలయ ఈవో తెలిపారు.

ఆన్‌లైన్‌లో భక్తుల ఆధార్ కార్డు ద్వారా ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందేలా ఏర్పాటు చేశారు. ఉచిత స్పర్శ దర్శనం ఆన్ లైన్ టోకెన్ విధానాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఆలయ ఈవో హెచ్చరించారు. ఇక నుంచి భక్తులు ఆన్ లైన్ లో టోకెన్ పొంది శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి రావాలని ఈవో శ్రీనివాసరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు.http://www.srisailadevasthanam.org లేదా http://www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి..

  • http://www.srisailadevasthanam.org లేదా http://www.aptemples.ap.gov.in అనే ఈ రెండు వెబ్​సైట్స్​లో ఏదో ఒకటి ఓపెన్ చేయాలి.
  •  మెయిన్ పేజీలో మెనూ బార్‌లో ‘ఆన్‌లైన్ బుకింగ్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • 'దర్శన్ టికెట్లు’ అనే ఆప్షన్ వస్తుంది.. దానిపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • మీరు కొత్తవారు అయితే మీ పేరుపై ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. గతంలో అకౌంట్ ఉన్నట్లయితే మొబైల్, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్ అవ్వాలి.
  • మీ పేరుపై ఓపెన్ అయిన అకౌంట్ మెయిన్ పేజీలో ‘సేవాస్ అండ్ దర్శనం’ అనే ఆప్షన్ కింద ‘బుక్ నౌ’ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో ‘దర్శన్’ అనే ఆప్షన్ కింద ‘బుక్ నౌ’పై నొక్కాలి.అప్పుడు ఓపెన్ పేజీలో ‘ఫ్రీ స్పర్శ దర్శనం’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దాన్ని సెలెక్ట్ చేయాలి.
  • అందులో మీరు వెళ్లే తేదీ, ఎంత మంది వెళ్తున్నారు. జెండర్ నమోదు చేయాలి. ఆపై మీ దగ్గర ఉన్న ఐడీ ఫ్రూవ్ (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ మరికొన్ని) ఎంచుకొని దాని సంఖ్యను నమోదు చేయాలి.
  • చివరిగా నోట్‌లో వివరాలు చదివి కన్ఫర్మ్ బుకింగ్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో మీ ఉచిత స్పర్శ దర్శనం టికెట్ బుక్ అవుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com