మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌ పై కఠిన చర్యలు

- July 05, 2025 , by Maagulf
మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌ పై కఠిన చర్యలు

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్‌లపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌ కు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుతో యాజమాన్యం తక్షణమే విచారణ ప్రారంభించింది.అంతర్గత విచారణలో ర్యాగింగ్ ఆరోపణలు నిజమని తేలింది.ఈ నేపథ్యంలో 13 మంది సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. హాస్టల్ నుంచి వారిని బహిష్కరించడంతో పాటు, ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధించారు. బాధిత జూనియర్ల నుంచి క్షమాపణలు కోరించి, రాతపూర్వక లేఖలు తీసుకున్నట్లు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

పోలీసులకు సమాచారం, మరింత విచారణ వేళ
ర్యాగింగ్ ఘటన జరిగిన జూన్ 22ననే పోలీసులకు సమాచారం అందించినట్టు ఆయన వెల్లడించారు. తమ అంతర్గత విచారణ పూర్తయిందని, ఇప్పుడు పోలీసుల విచారణ మిగిలిందన్నారు. పోలీసుల దర్యాప్తు ఆలస్యం అయినా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.ఈ అంశంపై మీడియా సంస్థలతో మాట్లాడిన వంశీకృష్ణారెడ్డి, బాధితులు మరియు నిందితుల పేర్లను బయటపెట్టకుండా నిగ్రహంగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, సంస్థ పేరు ఖ్యాతిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

ర్యాగింగ్‌ పై ఎయిమ్స్ స్పష్టమైన తీర్పు
వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించేందుకు ఎటువంటి రాయితీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ర్యాగింగ్‌ విషయంలో తాము సమర్ధంగా స్పందించామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com