సౌదీఅరేబియాలో మీటర్ ట్యాంపరింగ్ చేస్తే.. SR100000 జరిమానా..!!

- July 06, 2025 , by Maagulf
సౌదీఅరేబియాలో మీటర్ ట్యాంపరింగ్ చేస్తే.. SR100000 జరిమానా..!!

రియాద్: సౌదీ విద్యుత్ నియంత్రణ అథారిటీ.. విద్యుత్ చట్టంలోని నిబంధనలలో కొత్త సవరణలను ఆమోదించింది.ఈ సవరణలలో ప్రతి ఉల్లంఘనకు భారీ జరిమానాలను ప్రతిపాదించింది. ఉల్లంఘన తీవ్రతను బట్టి ఫైన్ ఉంటుందని పేర్కొంది.

విద్యుత్ మీటర్ను ట్యాంపరింగ్ చేసినందుకు దోషులుగా తేలిన వారికి SR5000 - SR100000 మధ్య జరిమానాలు విధించబడతాయి. బ్రేకర్ సామర్థ్యం 100 ఆంప్స్ లేదా అంతకంటే తక్కువ ఉంటే జరిమానా SR5,000గా నిర్ణయించారు. 100 -150 ఆంప్స్ మధ్య బ్రేకర్ సామర్థ్యం కోసం ఇది SR15,000కి పెరుగుతుంది. 150 - 400 ఆంప్స్ మధ్య బ్రేకర్ సామర్థ్యం ఉన్న విద్యుత్ మీటర్ను ట్యాంపరింగ్ చేసినందుకు జరిమానా SR50,000. సామర్థ్యం 400 ఆంప్స్ కంటే ఎక్కువగా ఉంటే జరిమానా SR100,000కి చేరుకుంటుంది.

విద్యుత్ మీటర్ లేదా దాని ఉపకరణాలను ట్యాంపరింగ్ చేసినందుకు జరిమానా SR 50,000గా ఉంటుందని తెలిపారు.ఈ సవరణలు పది ప్రాథమిక ఉల్లంఘనలను కవర్ చేస్తాయని అథారిటీ పేర్కొంది.

వినియోగదారులకు అందించే విద్యుత్ సేవలకు సంబంధించిన నిబంధనలలో నిర్దేశించిన ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే SR2,000 - SR50,000 జరిమానా విధించనున్నట్లు అథారిటీ తెలిపింది.      

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com