తెలంగాణలో ఐఐఐటీ ప్రవేశాలు..
- July 06, 2025
హైదరాబాద్: మహబూబ్ నగర్, బాసరలోని ఐఐఐటీ ప్రవేశాల మెరిట్ లిస్ట్ ను అధికారులు విడుదల చేశారు. బాసరలోని ఆర్జీయూకేటీలో 1,509 మంది, మహబూబ్నగర్ క్యాంపస్ లో 181 మంది ఎంపికైనట్టుగా వెల్లడించారు. వీరికి సంబంధించిన జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగానే ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 7 నుంచి జూలై 9వ తేదీ వరకు జరుగనుంది. కౌన్సిలింగ్ కి హాజరయ్యే విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
ఐఐఐటీ 2025 మెరిట్ లిస్ట్ వివరాలు:
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ తోపాటు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు ఉన్నాయి.ఈ రెండు క్యాంపస్ లలో కలిపి మొత్తం 1,690 సీట్లు ఉండగా అందులో ఈసారి 72 శాతం సీట్లు బాలికలకే దక్కడం విశేషం. ఎంపికైన అభ్యర్థులలో బాలికలు 1,225 మంది ఉండగా, బాలురు కేవలం 465 మంది మాత్రమే ఉన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కలిపించనున్నారు అధికారులు. ప్రాథమికంగా ఎంపిక మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ https://www.rgukt.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.rgukt.ac.inలోకి వెళ్ళాలి
- తర్వాత యూజీ అడ్మిషన్స్ 2025 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తరువాత ప్రొవిజినల్ సెలెక్టడ్ లిస్ట్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ – 2025 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..