8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ప్రారంభించిన బాలకృష్ణ
- July 06, 2025
అమెరికా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని బాలకృష్ణ అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానని బాలకృష్ణ అన్నారు.
18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణా మాత్యులు రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలని బాలకృష్ణ అన్నారు. పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు.
8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







