పెరగనున్న వీసా ఫీజులు
- July 08, 2025
అమెరికా: అమెరికాలో వీసా తీసుకునే వారి కోసం త్వరలోనే కొత్త ఆర్థిక భారం వేయబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు తీసుకునే ప్రతి ఒక్కరూ ఇకపై అదనంగా ఇంటిగ్రిటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం వీసా అప్లికేషన్ సమయంలో $250 డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటిగ్రిటీ ఫీజు పెరిగే ఛాన్స్
ఈ ఇంటిగ్రిటీ ఫీజు భవిష్యత్తులో మరింత పెరగవచ్చు. 2026 నుంచి ప్రతి సంవత్సరం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ఈ ఫీజు స్వయంగా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఈ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించబోరనీ, రద్దు చేయడానికి కూడా అవకాశం ఉండదని అధికారికంగా వెల్లడించారు. ఈ విధంగా అమెరికాలో వీసా తీసుకునే విదేశీయులకు ఇది భారీ ఆర్థిక భారం అవుతుందని భావిస్తున్నారు.
భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై భారం
ఈ కొత్త నిబంధనల వల్ల ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రభావితులయ్యే అవకాశముంది. ఇప్పటికే వీసా ఫీజులు, ప్రాసెసింగ్ ఖర్చులు భారీగానే ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఇంటిగ్రిటీ ఫీజు విధించడం వలస జీవులపై మరింత భారం మోపినట్టే అవుతోంది. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమలైతే, అమెరికాలో వీసా పొందడం మరింత ఖరీదైన ప్రక్రియగా మారనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!