బహ్రెయిన్‌లో BD200 కంటే తక్కువ సంపాదిస్తున్న ప్రవాస కార్మికులు..!!
- July 09, 2025
మనామా: ప్రైవేట్ రంగంలో ప్రవాసులు, బహ్రెయిన్ కార్మికుల మధ్య పెరుగుతున్న ఆదాయ అంతరాన్ని సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ (SIO) ఇటీవలి నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఎక్కువ మంది విదేశీ కార్మికులు నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారని నివేదిక వెల్లడించింది.డేటా ప్రకారం..కేవలం 4% మంది ప్రవాసులు నెలకు BD1,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి 470,145 మంది బీమా ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ వారిలో 71% మంది( దాదాపు 332,270 మంది) నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. బహ్రెయిన్‌లలో కేవలం 2% మంది (2,142 మంది) అత్యల్ప ఆదాయ వర్గంలో ఉన్నారు. అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఫురుషుల సంఖ్య 483 ఉండగా 1,659 మంది మహిళలు ఉన్నారు.
BD200 మరియు BD399 మధ్య సంపాదిస్తున్న ప్రవాసులు 64,000 మంది ఉన్నారు. వీరిలో పురుషులు దాదాపు 80% మంది ఉన్నారు. బహ్రెయిన్‌లలో దాదాపు మూడవ వంతు మంది ఈ ఆదాయ వర్గంలోకి వచ్చారు. దాదాపు 8% మంది ప్రవాసులు BD400 - BD599 మధ్య, 2% మంది మాత్రమే BD600 - BD799 మధ్య సంపాదిస్తున్నారు. BD800 నుండి BD999 వరకు కేవలం 1% మంది ప్రవాసులు మాత్రమే ఉన్నారు. అదే బహ్రెయిన్‌లలో 8% మంది ఉన్నారు. ఇక నెలకు BD1,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిలో 20,431 ప్రవాసులు, 22,790 మంది బహ్రెయిన్ వాసులు ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం.. ప్రవాస శ్రామిక శక్తిలో 89.6% మంది పురుషులు (421,722), కేవలం 11.5% మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 66,822 మంది బహ్రెయిన్ పురుషులు ఉండగా, 37,636 మంది మహిళలు ఉన్నారు.
అదే సమయంలో బహ్రెయిన్ కార్మికులు నెలకు సగటున BD881 సంపాదిస్తుండగా, ప్రవాసులు సగటున BD271 మాత్రమే సంపాదిస్తున్నారు. బహ్రెయిన్ వాసులలో 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, సగటున BD1,732 సంపాదిస్తున్నారు. ప్రవాసులలో అత్యధికంగా సంపాదించేవారు 50–59 సంవత్సరాల వయస్సు గలవారు ఉండగా, సగటు జీతం BD664 ఉందని నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!