అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్..
- July 09, 2025
అమెరికా: మన టాలీవుడ్ లో క్రికెట్ బాగా ఆడవాళ్లు చాలా మంది ఉన్నారని తెలిసిందే. అఖిల్, తమన్, తరుణ్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ..ఇలా చాలా మంది క్రికెట్ బాగా ఆడతారు. వీళ్లంతా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక మ్యాచ్ లు ఆడతారు.ఇక సెలెబ్రిటీ క్రికెట్ లో రెచ్చిపోయి మరీ ఆడతారు. తాజాగా ఈ టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి అమెరికాలో క్రికెట్ ఆడి కప్ గెలిచారు.
అమెరికాలో నాట్స్(NATS) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మన టాలీవుడ్ స్టార్స్ అక్కడి తెలుగువారితో ఆడి గెలిచారు. ఇటీవల ఈ నాట్స్ వేడుకలకు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయిన సంగతి తెలిసిందే. తమన్ కెప్టెన్సీ లో, వెంకటేష్ పర్యవేకషణలో టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడి గెలిచారు. గెలిచిన కప్ తో ఫొటోలు దిగారు.
హీరో ఆది తాము గెలిచిన కప్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్, ఆది, అశ్విన్, ప్రశాంత్ వర్మ ఉన్నారు. వీరంతా వెంకటేష్ నుంచి కప్ తీసుకున్నట్టు ఫోటో దిగారు. ఇక ఈ మ్యాచ్ లో ఆది బెస్ట్ బౌలర్ గా కూడా మెమెంటో గెలిచాడు. దీంతో ఆది షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు